
సుబ్బు మంగదేవి దర్శక్త్వంలో అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన ‘బచ్చల మళ్ళీ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేస్తున్నారు. బచ్చల మల్లి సినిమాని రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి హాస్య మూవీఎస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇది పూర్తికాగానే అల్లరి నరేష్ 63వ సినిమా ప్రారంభించేశారు. అల్లరి నరేష్ కొత్త సినిమాకి శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాకి రచయిత, దర్శకుడు మెహర్ తేజ్ దర్శకత్వం చేస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీబ్రాన్ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వారం రోజులలో మొదలుపెడతామని సహ నిర్మాత వెంకట్ ఉప్పుటూరి చెప్పారు.