.jpeg)
రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా నుంచి రెండో పాట సోమవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘క్యా లఫ్డా... క్యా లఫ్డా...’ అంటూ సాగే ఆ రెండో పాట ప్రమో శుక్రవారం విడుదల చేశారు.
శ్రీహర్ష యేమని వ్రాసిన ఈ పాటకి మణిశర్మ స్వరపరిచి సంగీతం అందించగా ధనుంజయ్, సింధూజా శ్రీనివాసన్ హుషారుగా పాడారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, మకరంద్ దేశ్ పాండే, టెంపర్ వంశీ, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: పూరీ జగన్నాధ్, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ, కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, కెమెరా: శ్యామ్ కె నాయుడు, జియాణీ జియానెల్లి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, చేస్తున్నారు.
పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
𝓢𝓲𝔃𝔃𝓵𝓲𝓷𝓰 𝓒𝓱𝓮𝓶𝓲𝓼𝓽𝓻𝔂 & 𝓢𝓸𝓾𝓵𝓯𝓾𝓵 𝓜𝓾𝓼𝓲𝓬 🎸
— RAm POthineni Fc (@PothineniFc) July 27, 2024
ROMANTIC MELODY OF THE SEASON #KyaLafda song promo out now ❤️🔥
-- https://t.co/FznZe7LoFY#DoubleIsmart 3rd Single Out On July 29th 🎶💗
A #ManiSharma Musical 🎹#DoubleIsmartOnAug15 pic.twitter.com/IKsYp3SKRm