
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర సినిమా నుంచి మరో పాట విడుదల కాబోతోంది. త్వరలో హీరో హీరోయిన్ల రొమాంటిక్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు టీ-సిరీస్ సంస్థ ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తీయబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీ ఖాన్, బాబీ డియోల్ ఇద్దరు విలన్లు ఉన్నారు. వారిలో బాబీ డియోల్ దేవర మొదటి భాగం ముగింపులో ఎంట్రీ ఇస్తారని సమాచారం.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.