
మనోజ్ బాజ్‌పాయ్ ప్రధానపాత్రలో రాజ్ అండ్ డికె దర్శకులు తీసిన ‘ఫ్యామిలీ మ్యాన్’ 1,2, దాని తర్వాత గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.
వారి దర్శకత్వంలోనే వరుణ్ ధావన్, సమంత ప్రధానపాత్రలలో ‘సిటడేల్: హనీ-బన్నీ అనే మరో వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది.
తాజాగా వారిరువురి దర్శకత్వంలో మరో కొత్త వెబ్ సిరీస్ మొదలుపెట్టారు. దాని పేరు హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’, ఇంగ్లీషులో ‘ది బ్లడీ కింగ్‌డమ్’ అని ప్రకటించారు. రాజ్ అండ్ డికె తొలిసారిగా దీంతో యాక్షన్, ఫాంటసీ సిరీస్ చేస్తున్నారు.
దీనిలో సమంత ఓ ప్రధానపాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలయ్యిందని పూర్తవగానే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో విడుదలవుతుందని దర్శకులు రాజ్ అండ్ డికె చెప్పారు. తమతో పాటు మరో దర్శకుడు అనిల్ బర్వే కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటారని వారు చెప్పారు.