
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారిగా ‘దేవర’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అప్పుడే రామ్ చరణ్, నానిలతో మరో రెండు సినిమాలు అందుకుంది. ఆమె నటించిన హిందీ సినిమా ‘ఉలజ్’ త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాల గురించి ఆసక్తికరమైన వివరాలు చెపుతున్నారు.
దేవర సినిమా గురించి చెపుతూ జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివపై ఆమె ప్రశంశల వర్షం కురిపించారు. జూ.ఎన్టీఆర్ దేనినైనా క్షణంలో నేర్చేసుకుని అవలీలగా నటిస్తారని, డాన్స్ చేస్తారని కానీ తనకు కనీసం 10 రోజులు సమయం పడుతుందని జాన్వీ కపూర్ చెప్పారు. అందుకే జూ.ఎన్టీఆర్ తాను చేయబోయే మరో డాన్స్‌కి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పారు. జూ.ఎన్టీఆర్ సెట్స్‌లో అడుగుపెడితే అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారని చెప్పారు.
దర్శకుడు కొరాటాల శివ ఇందుకు పూర్తిభిన్నంగా ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటూ, చాలా ప్లాన్ ప్రకారం శరవేగంగా షూటింగ్ పూర్తిచేస్తుంటారని జాన్వీ కపూర్ చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసే కళాకారులు, సాంకేతిక నిపుణులు, యూనిట్ సభ్యులు అందరూ ఏదో మొక్కుబడిగా కాకుండా సినిమాలపై చాలా ఆరాధనతో చాలా అంకితభావంతో పనిచేస్తుండటం తాను గమనించానని జాన్వీ కపూర్ చెప్పారు.