మరీ ఇంత చాతకాని వాళ్ళయితే ఎలా? అనసూయ ట్వీట్‌

తెలుగు సినీ నటి అనసూయ భరద్వాజ్ మంచి నటిగా పేరు సంపాదించుకున్నప్పటికీ, తరచూ సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తూ బోనస్‌గా పాపులారిటీ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ఓసారి విజయ్‌ దేవరకొండపై ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా అతని అభిమానులు నేటికీ ఆమెను సోషల్ మీడియాలో వెంటాడుతూనే ఉంటారు. విమర్శిస్తూనే ఉంటారు. కానీ వాటికి ఆమె ఏమాత్రం బెదిరిపోకుండా ధాటిగా సమాధానాలు ఇస్తుండటంతో ఆమె ట్రోలింగ్ అవుతూనే ఉంటారు.

కానీ ఇది కూడా ఓ విదంగా ఉచిత ప్రచారమే అని ఆమె భావిస్తున్నారో ఏమో ఒకవేళ తనపై విమర్శలు తగ్గిన్నట్లనిపిస్తే మళ్ళీ ఆమె స్వయంగా ఏదో ఒక మెసేజ్ పెట్టి  తనను విమర్శించేవారిని రెచ్చగొడుతుంటారు. ఆమె తాజా ట్వీట్‌ చూస్తే నిజమే అనిపించకమానదు. 

“మరీ ఇంత చేతకానివాళ్ళలా ఉంటే ఎలాగండి? నిజంగా మీకు దమ్ముంటే నా మీద కాదు... తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని ఆనంది. కానీ మీరు ఆలా చేయరు కదా? ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశ్యించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానా,” అంటూ వ్యంగ్యంగా మెసేజ్ పెట్టారు. 

ఇలాంటి మెసేజ్ పెడితే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా?కనుక మళ్ళీ వెంటనే ఆమెకు ఘాటుగా జవాబులు మొదలైపోయాయి.