ఆ విషయం మేము కాదు రాజ్‌తరుణ్‌ చెప్పాలి: దర్శకుడు

రాజ్‌తరుణ్‌ నటించిన పురుషోత్తముడు శుక్రవారం విడుదలకాబోతుండగా, మరో సినిమా ‘తిరగబడరా సామి’ ఆగస్ట్ 2న వారం రోజుల వ్యవధిలో విడుదల కాబోతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో రాజ్‌తరుణ్‌-లావణ్య పోలీస్ కేసు మొదలవడంతో దానిపై సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. 

రాజ్‌తరుణ్‌ తనతో 10 ఏళ్ళు సహజీవనం చేసి శారీరకంగా వాడుకొని ఇప్పుడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కనుక ఈ కేసు, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చల ప్రభావం తమ సినిమాలపై పడుతుందని దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. 

అయితే “ఒక్కోసారి ఈవిదంగా నెగెటివ్ ప్రచారం కూడా సినిమాలకు కలిసి వస్తుంది కదా?” అని మీడియా ప్రతినిధులు ‘తిరగబడరా సామి’ సినిమా దర్శకుడు ఏఎస్ రవి కుమార్‌ని ప్రశ్నించిన్నప్పుడు, ఆయన స్పందిస్తూ, “మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కనుక మా సినిమాకు నెగెటివ్ ప్రచారం అవసరమే లేదు. 

అయినా మా సినిమా కోసం వారి వ్యక్తిగత సమస్యలను వాడుకోవాలనుకుంటే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. ఈ వ్యవహారంపై మేము మాట్లాడటం సరికాదు. రాజ్‌తరుణ్‌ స్వయంగా మాట్లాడితేనే మంచిది,” అని అన్నారు. 

రాజ్‌తరుణ్‌-లావణ్యలలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే సంగతి పక్కన పెడితే సినిమా విడుదలయ్యే సమయానికి ఇటువంటి కేసు, పరిణమాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి కనుక  సినిమా విజయావకాశాలను దెబ్బ తీసే ప్రమాదం కూడా ఉంటుంది.