బాలకృష్ణ 111వ సినిమా దిల్‌రాజుతో?

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలందరితో సినిమాలు తీశారు. కానీ ఇంతవరకు చిరంజీవి, బాలకృష్ణలతో మాత్రం తీయలేదు. బాలకృష్ణ 100 వ చిత్రం తానే తీయాలని దిల్‌రాజు చాలా గట్టిగా ప్రయత్నించారు కానీ కుదరలేదు.

ఇప్పుడు ఆయన 111వ సినిమాని తీయాలని దిల్‌రాజు పట్టుదలగా ఉన్నారు. బాలకృష్ణకు తగిన కొన్ని కధలు విని వాటిలో మూడింటిని ఆయన కుమార్తె బ్రాహ్మణికి వినిపించగా వాటిలో ఒకటి ఆమె ఫైనల్ చేసిన్నట్లు తెలుస్తోంది. కుమార్తె ఒకే చేస్తే బాలకృష్ణ కూడా ఒకే చేస్తుంటారు. కనుక బాలకృష్ణ-దిల్‌రాజు కాంబినేషన్‌లో సినిమా మొదలవడం ఖాయమే అని భావించవచ్చు. 

బాలకృష్ణ భగవంత్ కేసరి (108వ చిత్రం) తర్వాత బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.

దీని తర్వాత మళ్ళీ బోయపాటి శ్రీను ధర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. దాని తర్వాత సినిమా దిల్‌రాజు చేసే అవకాశం ఉంది.