
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో కల్కి ఎడి2898 సినిమా జూన్ 17న విడుదలైన పదిహిను రోజులలోగానే వెయ్యి కోట్ల కలక్షన్స్ రాబట్టి ఇంకా దూసుకుపోతూనే ఉంది. తాజాగా ఆ సినిమా టికెట్స్ అమ్మకాలకు సంబందించి రికార్డ్ వెలువడింది.
ఈ 20 రోజులలో బుక్ మై షో యాప్ ద్వారా 1,21,50,000 టికెట్స్ అమ్ముడయ్యాయని ఆ సంస్థ ప్రకటించింది. మద్యలో కాస్త తగ్గినప్పటికీ జూన్ 27, 28,29, 30 తేదీలలో (గురు, శుక్ర, శని, ఆదివారం) నాడు వరుసగా 11,20,000, 11,72,000, 12,80,000, 11,20,000 టికెట్స్ అమ్ముడయ్యాయి.
కల్కి ఎడి2898 విడుదలైనప్పటి నుంచి ఈరోజు వరకు అత్యల్పంగా జూలై 15వ తేదీన 89,000 టికెట్స్ అమ్ముడయ్యాయి. మిగిలిన రోజులలో 14 లక్షల నుంచి 72 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడవుతున్నాయి.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్‌కి ఆ తర్వాత చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ రెండు భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఈ కల్కి ఎడి2898 ఒక్క సినిమాతో ప్రభాస్ పేరు అంతర్జాతీయంగా మారుమ్రోగిపోతోంది.
అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు సాధించి భారత్ పేరు, భారతీయ సినీ పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా దర్శకుడు రాజమౌళి చేయగా, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తన కల్కి ఎడి 2898 సినిమాతో అంతకు మించి గొప్ప పేరు సంపాదించి పెట్టాడు.