మా ఊరి జాతరలో... బచ్చలమల్లి నుంచి ఫస్ట్ లిరికల్!

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా చేసిన ‘బచ్చలమల్లి’ సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో సాంగ్‌ ఈరోజు విడుదలైంది. మా ఊరు జాతరలో అంటూ జానపద బాణీలో సాగే ఈ పాటని శ్రీమణి వ్రాయగా, సీతారామం వంటి చక్కటి పాటలు స్వరపరిచిన విశాల్ చంద్రశేఖర్ ఈ పాటని చాలా చక్కగా స్వరపరిచారు. 

మా ఊరి జాతరలో... కాటుక కళ్ళతో... చాటుగా రమ్మని...  సైగే చేసే చిన్నది... వాముకాడ వరుసగట్టి... మంచం మీన ముద్దులెట్టి....  వందేళ్ళ కౌగిలళ్ళుకుంటానన్నది పిల్లది... అంటూ సాగే ఈ పాటని గౌర హరి, సింధూరి విశాల్ మృదుమధురంగా ఆలపించారు. పాట చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది.  

ఈ సినిమాలో అల్లరి నరేష్ ట్రాక్టర్ నడుపుకుంటూ బ్రతికే బచ్చల మల్లిగా నటిస్తున్నారు. కాస్త మొరటుతనం, మొండితనం, మూర్ఖత్వం బచ్చలమల్లి ప్రత్యేక లక్షణాలన్నీ మొదటే నరేష్ పాత్ర ఏవిదంగా ఉండబోతోందో పరిచయం చేశారు. 

ఈ సినిమాలో రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.    

ఈ సినిమాకి దర్శకుడు: సుబ్బు  మంగదేవి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేస్తున్నారు.

అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న బచ్చల మల్లిని రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి హాస్య మూవీఎస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.