ఇదేదో గ్రామ పంచాయితీలో తగువు వ్యవహారం కాదు. మా ఊరి పొలిమేర సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మద్య పంచాయితీ... ఇప్పుడు కోర్టుకి వచ్చింది.
ఇంతకీ పొలిమేర పంచాయితీ దేనికంటే, 2021లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దాని నిర్మాత గౌరి కృష్ణ ప్రసాద్ దానికి సీక్వెల్ తీస్తే అది సూపర్ హిట్ కాకపోయినా మంచి కలక్షన్స్ రాబట్టింది. అప్పుడే పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.
పొలిమేర -1,2 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన నందిపాటి వంశీ నిర్మాతగా మారి మూడో భాగం తీస్తున్నారు. అయితే ఈ సినిమాపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని, సీక్వెల్ ద్వారా వచ్చిన రూ.30 కోట్లలో తన వాటా ఇవ్వలేదని దాని గురించి అడిగితే చంపేస్తానని నందిపాటి వంశీ తనను బెదిరిస్తున్నాడంటూ నిర్మాత గౌరి కృష్ణ ప్రసాద్ హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కనుక నందిపాటి వంశీ నుంచి సీక్వెల్ లాభాలలో తన వాటా తనకు ఇప్పించి, మూడో భాగంపి తన హక్కులను కాపాడాలని కోరుతూ నిర్మాత గౌరి కృష్ణ ప్రసాద్ పిర్యాదులో కోరారు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్లో తేలకపోతే ఇది కోర్టుకి చేరడం ఖాయమే.