కిరణ్ అబ్బవరం సినిమా పేరు ‘క’… రేపు టీజర్‌

యువ నటుల్లో కిరణ్ అబ్బవరం చక్కటి కధాంశాలతో విభిన్నమైన పాత్రలు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. రాజావారు రాణీవారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం వంటి చక్కటి సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా ‘క’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా టీజర్‌ సోమవారం ఉదయం 11.03 గంటలకు విడుదల కాబోతోంది. 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి అనే గ్రామంలో జరిగిన పీరియాడికల్ కధతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

రేపు టీజర్‌ విడుదల చేస్తున్న సందర్భంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. దానిలో హీరో పోస్ట్ మ్యాన్ డ్రెస్ వేసుకొని, భుజాన్న బ్యాగ్, చేతిలో ఉత్తరాల కట్ట పట్టుకొని నడిచి వెళుతున్నట్లు చూపారు. ఈ సినిమాలో తాంవీ రామ్, సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.      

ఈ సినిమాకి దర్శకత్వం: సుజీత్-సందీప్, సంగీతం: శ్యామ్ సీఎస్, కెమెరా: విశ్వాస్ డానియల్, సతీష్ రెడ్డి చేస్తున్నారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చింతా గోపాల కృష్ణరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.