బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో ప్రభాస్ (నందీశ్వరుడు) చేస్తున్నట్లు ప్రకటించినప్పుడే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాని 5 భాషల్లో బారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తుండటంతో దీనిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (శివుడు), కాజల్ అగర్వాల్ (పార్వతీదేవి), శరత్ కుమార్ (నాధ నాధుడు), ఇంకా మోహన్ బాబు, నయనతార, మధుబాల, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ నటి నుపూర్ సనన్ ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని పాత్రలకు సంబందించి విడుదల చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్లు చాలా ఆకట్టుకున్నాయి. శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకొని ఎవరినో సవాలు చేస్తున్నట్లున్న పోస్టర్ చాలా ఆకట్టుకునేలా ఉంది.
కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న చేస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మిస్తున్నారు. కన్నప్ప ఎప్పుడు విడుదల చేసేది ఇంకా ప్రకటించవలసి ఉంది.