.jpeg)
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు-2 చాలా భారీ అంచనాలతో జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. కానీ సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అనేక సమస్యలు, సవాళ్ళు, వివాదాలు అన్నిటినీ అధిగమించి ఏళ్ళతరబడి తీసిన భారతీయుడు-2 థియేటర్లలో గట్టిగా నిలబడలేకపోవడం బాధాకరమే.
ఎవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన హనుమాన్ సినిమా ఓటీటీలోకి రావడానికి సుమారు మూడు నెలలు సమయం తీసుకుంది. కానీ ఇంత భారీ బడ్జెట్‌తో తీసిన భారతీయుడు సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆదివారం నుంచి అంటే శనివారం అర్దరాత్రి దాటిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రసారం కాబోతోందని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
సుమారు 27 సంవత్సరాల క్రితం శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సూపర్ హిట్ అయ్యింది. ఇన్నేళ్ళ తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చిన భారతీయుడు-2 మాత్రం థియేటర్లలో పట్టుమని పది రోజులు ఆడలేకపోవడం విచిత్రమే.
భారతీయుడు-2 ఫ్లాప్ అవడంతో ఆ ప్రభావం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై ఎక్కడ పడుతుందో అని రామ్ చరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గేమ్ చేంజర్ సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది.