
యువ నటులు కృష్ణ వంశీ, మోక్ష జంటగా ‘అలనాటి రామచంద్రుడు’ అనే పేరుతో చక్కటి లవ్ స్టోరీ వస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. పూర్తిగా రెండు నిమిషాల నిడివి కూడా లేని టీజర్‌లో మొదటి నుంచి చివరి వరకు చక్కటి డైలాగ్స్ మంచి అనుభూతి కలిగిస్తాయి. అనేక షార్ట్ ఫిలిమ్స్ తీసి మంచి పేరు, అవార్డులు అందుకున్న చిలుకూరి ఆకాష్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డి, పాటలు: చంద్రబోస్ తదితరులు, సంగీతం: శశాంక్, కెమెరా: ప్రేమ్ సాగర్, ఎడిటింగ్: శ్రీకర్, ఫైట్స్: అంజి ఫైట్ మాస్టర్, కొరియోగ్రఫీ: మెహర్ బాబ, మణికంఠ, ఆర్ట్: పి రవీందర్ చేస్తున్నారు. ఈ సినిమాని హైనీవా క్రియెషన్స్ బ్యానర్‌పై హైమవతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు.