వెయ్యి కోట్లు క్రాస్ చేసిన కల్కి కలక్షన్స్‌

ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో కల్కి ఎడి2898 సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించినప్పటి నుంచే దర్శకుడు నాగ్ అశ్విన్‌ సినిమాపై అంచనాలు పెంచేవిదంగా ప్రమోషన్స్ చేశారు. కనుక ఏ మాత్రం తేడా వచ్చినా సినిమా బోల్తా పడేది.

కానీ ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉండటంతో కేవలం 17 రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు కలక్షన్స్‌ రాబట్టగలిగింది. ఇంకా జెట్ స్పీడుతో దూసుకుపోతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాని ఇంతగా ఆదరించినందుకు వైజయంతీ మూవీస్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ అమితాబ్‌ బచ్చన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. 

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో నిర్మించిన కల్కి కలక్షన్స్‌ భారతీయ సినిమాల రికార్డులే కాదు హాలీవుడ్ సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

కల్కి ఎడి2898లో దీపికా పడుకొనే, దిశా పఠానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, పశుపతి, శాశ్వత చటర్జీ, అన్నా బెన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.      

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వినీ దత్ కల్కి ఎడి2898ని నిర్మించారు. దీనికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్‌ ప్రకటించారు.