రాజాసాబ్ ఎక్కడున్నారు?

ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో కల్కి విడుదలై ఇప్పటికే 15 రోజులు అయినందున క్రమంగా ఆ హడావుడి తగ్గి, ప్రభాస్‌ తదుపరి సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. 

కల్కి తర్వాత మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ విడుదల కావలసి ఉంది. దాని తర్వాత హనుమాన్‌ రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దానికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌ ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్ సైన్యంలో ఫౌజీ (సైనికుడు)గా ప్రభాస్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ మూవీలో ప్రభాస్‌కు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ ఖరారు అయిన్నట్లు తెలుస్తోంది. 

ప్రభాస్‌ సినిమా అంటే భారీ యాక్షన్ సినిమా అనే  ముద్ర పడిపోయింది. కానీ ఈ సినిమాలో దర్శకుడు హనుమాన్‌ రాఘవపూడి యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ప్రభాస్‌-మృణాల్‌ ఠాకూర్‌లతో మంచి ప్రేమ కధని కూడా సమాంతరంగా చూపబోతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.        

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్-1కి సీక్వెల్‌గా ‘శౌర్యాంగపర్వ’, సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే మరో సినిమా ప్రభాస్‌ చేయాల్సి ఉంది. వాటిలో స్పిరిట్ సినిమా అటకెక్కిపోయిందని ఊహాగానాలు వినిపించాయి.

కానీ దర్శకుడు సందీప్ వంగా వాటిని ఖండిస్తూ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. కనుక శౌర్యాంగపర్వ ముందే ప్రభాస్‌ ఈ సినిమాని మొదలుపెట్టే అవకాశం ఉంది.  ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటించబోతున్నారు.

‘శౌర్యాంగపర్వ’ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్దంగా ఉందని ప్రభాస్‌ వస్తే సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టడానికి సిద్దంగా ఉన్నామని నిర్మాత విజయ్‌ దేవరకొండ కిరంగదూర్ చెప్పారు. 

ఈ మూడు సినిమాలు పూర్తి చేసేలోగా మళ్ళీ కల్కి ఎడి2898 సీక్వెల్‌ షూటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. కనుక ప్రభాస్‌ 2025లో ఇవికాక మరో కొత్త సినిమా మొదలుపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. 

మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో రాజాసాబ్ సినిమా 2025 జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదలయ్యే అవకాశం ఉంది.