ఆహాలో ‘హాట్ స్పాట్’ పెద్దలకు మాత్రమే

అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన తమిళ సినిమా ‘హాట్ స్పాట్’ తెలుగు వెర్షన్ జూలై 17 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. 

విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో మార్చి 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు చిన్న పిల్లలు చూడదగ్గవిగా లేవంటూ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత తమిళనాడులో దీనిపై చాలా చర్చ జరిగింది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోంది. 

ఈ సినిమాలో కలైయరసన్, ఆదిత్య, గౌరి కిషన్, అభిరామ్, జనని అయ్యర్, శాండీ మాస్టర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.