
యువ నటుడు సంతోష్ శోభన్ హీరోగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే సినిమా సిద్దం అవుతోంది. ఈరోజు సంతోష్ శోభన్ పుట్టిన రోజు సందర్భంగా కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మానస వారణాశి హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్, కెమెరా: దినేష్ పురుషోత్తమ్, ఎడిటింగ్: గణేశ్ శివ, ఆర్ట్: మైచేల్ బీఎఫ్ఏ చేస్తున్నారు. యూవీ క్రియెషన్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డే రోజున ఈ సినిమా విడుదలకానుంది.