
మాస్ మహారాజ రవితేజ-మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘మిస్టర్ బచ్చన్’ సినిమానుంచి ‘చిట్టి గువ్వపిట్ట లాంటి చక్కనమ్మా... బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. సాహితి వ్రాసిన ఈ పాటకు మిక్కీ జె మేయర్ స్వరపరచగా సాకేత్ కొమండూరి, సమీరా భరద్వాజ్ చాలా హుషారుగా ఆలపించారు.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్. కెమెరా: ఆయనంక బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.