
రచయిత దర్శకుడైతే ఎలాంటి అద్భుతాలను సృష్టించొచ్చు అనే విషయం కొరటాల శివ ద్వారా అందరికి తెలుస్తుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ హిట్లతో తన రేంజ్ ఏంటో అందరికి తెలియచేశాడు. ఇక ప్రస్తుతం మహేష్ తో మరోసారి సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా ముహుర్తం రోజే సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మహేష్ శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా అంతకంటే ఎక్కువ విజయం సాధిస్తుందని.. ఈ కథ కూడా అంత శక్తివంతమైనదని అంటున్నారు కొరటాల శివ.
ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి కథల్లో శ్రీమంతుడు ఒకటి అయితే ప్రస్తుతం దాన్ని మించిన కథతో ఈ సినిమా ఉంటుందని అన్నారు కొరటాల శివ. ఇక తనతో మహేష్ సినిమ అంటే భారీ అంచనాలుంటాయని ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందని అన్నారు. మహేష్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్న కొరటాల శివ ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ నుండి మరో శ్రీమంతుడు వచ్చేసినట్టే అని ఫిక్స్ అవుతున్నారు. మరి కొరటాల శివ ఏం చేస్తాడో చూడాలి.
రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉండగా టైటిల్ అది కాదని ఇంకా నిర్ణయించలేదని అన్నారు.