క్రేజీ కాంబోకి బ్రేకులు పడ్డట్టేనా..!

మెగా హీరోలకు త్రివిక్రం శ్రీనివాస్ కు ఎక్కడో రాసి పెట్టి ఉంది. అందుకే పవర్ స్టార్ తోనే కాదు జులాయిగా అల్లు అర్జున్ తో కూడా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమాకు సిద్ధమైన త్రివిక్రం అల్లు అర్జున్ తో మాత్రం ఇప్పుడప్పుడే సినిమా చేసే పరిస్థితులు కబడట్లేదు. త్రివిక్రం సినిమా తర్వాత ఎన్టీఆర్, మహేష్ లైన్లో ఉన్నారు. ఇక ఈ గ్యాప్ లో మరో కుర్ర హీరోతో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రం.   

ఇక బన్ని విషయానికొస్తే ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం పూర్తి చేసుకున్నాక లింగుస్వామితో సినిమా ఉంది. అది పూర్తయ్యాక విక్రం కె కుమార్ తో కూడా సినిమా ప్లాన్లో ఉన్నాడు. సో ఎటు చూసినా 2017, 18 ఈ రెండు సంవత్సరాలు త్రివిక్రం, అల్లు అర్జున్ కలిసి పనిచేసే అవకాశాలు కనిపించట్లేదు. కుదిరితే 2019లో ఏమన్నా ఈ కాంబినేషన్లో సినిమా రావొచ్చు.

మొత్తానికి క్రేజీ కాంబినేషన్ కు బ్రేకులు పడ్డట్టే అంటున్నారు పరిశ్రమ వర్గాలు. స్టైలిష్ స్టార్ యొక్క క్రేజ్ త్రివిక్రం సినిమాల్లో నటించాకే కాస్త పెరిగింది అన్న వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా త్రివిక్రం బన్ని సినిమా వస్తే మెగా అభిమానులకే కాదు సిని ప్రేమికులకు అదో సర్ ప్రైజ్ అన్నది మాత్రం నిజం.