ఇది అసలైన సాహసమేనబ్బా..!

సాహసం సినిమాలోనే కాదు రిలీజ్ విషయంలో కూడా చేస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. తను హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఎన్నాళ్ల నుండో రిలీజ్ కష్టాలు పడుతూ వచ్చింది. గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోది 500, 1000 నోట్ల రద్దు కార్యక్రమంలో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. కాని సాహసం శ్వాసగా సాగిపో మాత్రం రిలీజ్ కన్ఫాం అంటున్నారు. 

తమ దగ్గరున్న నోట్లను మార్చుకునేందుకే నానా అవస్థలు పడుతున్న జనాలు సినిమా చూస్తారా అంటే నిన్నటి పరిస్థితి కన్నా ఈరోజు బెటర్ రేపటి కల్లా ఇంకాస్త బెటర్ గా ఉంటుందని. ఎన్నో రోజులుగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి రేపు రిలీజ్ చేసెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు సాహసం నిర్మాతలు. మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందించడం జరిగింది.

ప్రేమం హిట్ తో ఫుల్ ఖుషిగా ఉన్న నాగ చైతన్య సాహసం సినిమాతో కూడా మరో హిట్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నాడు. మరి చైతు సాహసం ఏమేరకు ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.