కల్కి ఎడి2898లో భైరవ యాంతమ్ సాంగ్‌ ప్రమో

ప్రభాస్‌ హీరోగా వస్తున్న కల్కి ఎడి2898 సినిమా నుంచి భైరవ్ యాంతమ్ సాంగ్‌ ఈరోజు కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఈ పాటని ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిట్ దోసన్హ్ పంజాబీ స్టైల్లో పాడారు. రేపు పూర్తి పాటని విడుదల చేస్తామని తెలిపారు. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో జూన్ 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో దీపికా పడుకొనే, దిశా పటానీ, హీరోయిన్లుగా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శాశ్వత చటర్జీ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కురుక్షేత్రం కాలంలోని ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వతామాగా నటిస్తున్నారు. ఓ శాపం వలన ఒంటి నిండా గాయాలతో ఓ గుహలో జీవిస్తున్నట్లు చూపారు. అశ్వతామాను కల్కి ఎడి2898 సినిమాతో ఏవిదంగా జోడించరనేది చాలా ఆసక్తికరమైన విషయం. 

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.