
నాచురల్ స్టార్ నాని, కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్‌జె.సూర్య ప్రధాన పాత్రలలో వివేక్ ఆత్రేయ దదర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమా నుంచి గరం గరం... అంటూ మాస్ బీట్‌తో సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
సనపతి భరద్వాజ్ పాత్రుడు వ్రాసిన ఈ పాటని జెక్స్ బిజోయ్ స్వరపరచగా విశాల్ దాడ్‌లాని హుషారుగా పాడారు.
నాని తన ఇమేజ్‌కి భిన్నంగా సినిమాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది కూడా అలాంటిదే. దీనిని ‘యాక్షన్-డ్రామా మిక్స్’గా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్, సాయి కుమార్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి.మురళి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ హక్కులు ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ దక్కించుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.