విశ్వంభరలో బాలీవుడ్‌ నటుడు కునాల్ కపూర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాది వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో బాలీవుడ్‌ నటుడు కునాల్ కపూర్ కూడా వచ్చి చేరారు. ఈ సినిమాని నిర్మిస్తున్న యూవీ క్రియెషన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు ఈ విషయం తెలియజేస్తూ కునాల్ కపూర్ పోస్టర్ కూడా పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు కూడా. ఈ సినిమాలో కునాల్ కపూర్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 

  ఈ సినిమాలో భీమవరం దొరబాబుగా నటిస్తున్న చిరంజీవికి త్రిష, ఆషికా రంగనాధన్ హీరోయిన్లు నటిస్తుండగా మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా ముఖ్య పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. దీనిలో ఆరు        పాటలుంటాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలిపారు. 

రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు అంటే 2025, జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది.