నెట్‌ఫ్లిక్స్‌లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

విశ్వక్ సేన్‌, నేహా శెట్టి ప్రధాన పాత్రలలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న థియేటర్లలో విడుదలైంది. సినీ విమర్శకులు ఈ సినిమా గురించి నెగెటివ్ రివ్యూలు వ్రాయడంతో చాలా నష్టపోయినా  15 రోజులలో బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లు గ్రాస్ కలక్షన్స్‌ రాబట్టుకొని ఒడ్డున పడింది.

ఈ సినిమా విడుదలయ్యి 15 రోజులు కాక మునుపే ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 14) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో కూడా ప్రసారం అవుతోంది. 

కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సీతార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మదాడి, ఆర్ట్: గాంధీ నడికుండికర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.