గోపీచంద్ విశ్వం సినిమా పోస్టర్ రిలీజ్

గోపీ చంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘విశ్వం’ అనే ఓ సినిమాని సిద్దం చేస్తున్నారు. బుధవారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. గోపీచంద్ స్పొర్ట్స్ బైక్‌పై దుమ్మురేపుతూ వస్తున్న ఫోటోతో పోస్టర్ చేశారు. 

ఈ సినిమాలో కావ్య థాపర్ గోపీ చంద్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, హీరోహీరోయిన్ల డ్యూయట్‌ సాంగ్స్ కోసం ఇటలీకి వెళ్ళి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్వం సినిమా షూటింగ్‌ జరుగుతోంది.  

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్ అందిస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, దోనేపూడి వేణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.    

ఈ ఏడాది దసరా దీపావళి పండుగ సీజనులో ఈ సినిమాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.