రవితేజ 75వ సినిమా షూటింగ్‌ షురూ పూజా కార్యక్రమాలు

మాస్ మహారాజ రవితేజ 75వ సినిమాకి మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయి. రచయిత బొగ్గవరపు భాను ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ వెంటనే మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమాని విడుదల కాబోతోంది. 

ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: నవీన్ నూలి చేయబోతున్నారు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తుంది. ఈ సినిమాలో నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు భాను తెలిపారు.  

రవితేజ-హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో ‘మిస్టర్ బచ్చన్’ అనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. 

పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు.