
తమిళ నటులలో విలక్షణమైన నటుడు విజయ్ సేతుపతి. విభిన్నమైన కధలు, పాత్రలతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో మహారాజా సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది.
ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజ, అభిరామి, సింగంపులి, అరుల్ దాస్, మునీష్ కాంత్, వినోద్ సాగర్ బాయస్ మణికందన్, కల్కి, సచన నామీదాస్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, తమిళ డైలాగ్స్: నిధిలన్ సామినాధన్, తెలుగు డైలాగ్స్: రామ్ మురళి, తెలుగు డబ్బింగ్: పోస్ట్ ప్రొ వసంత్, సంగీతం: బి.అజ్నీష్ లోక్నాధ్, కేంద్రళ్ దినేష్ పురుషోత్తమన్, ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్, స్టంట్స్: అరసు చేశారు.
పాషాన్ స్టూడియోస్ అండ్ ది రూట్ బ్యానర్‌పై సుధాన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ సినిమాని తమిళంలో నిర్మించగా దానిని తెలుగులో డబ్ చేసి ఈ నెల 14న విడుదల చేస్తున్నారు.