అనుపమ ఆల్మోస్ట్ ఓకేనా..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఓకే అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే త్రివిక్రం అఆ సినిమాలో నటించి మెప్పించిన అనుపమ రీసెంట్ గా ప్రేమం రీమేక్ గా వచ్చిన చైతు ప్రేమంలో కూడా ఆడియెన్స్ మనసు దోచేసింది. ఇక పవన్ త్రివిక్రం కాంబోలో వస్తున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉండగా సెకండ్ హీరోయిన్ గా అనుపమ ఆల్మోస్ట్ ఓకే అయినట్టే అంటున్నారు. 

ఓ పక్క త్రివిక్రం తో రెండో ఆఫరే లక్కీ అనుకుంటే మరో పక్క పవన్ తో చేస్తుందంటే స్టార్ హీరోయిన్ గా అమ్మడికి డోర్ పాస్ లభించినట్టే. ఎన్నాళ్లనుండో ఇండస్ట్రీలో ఉన్నా పవర్ స్టార్ తో నటించే ఛాన్స్ రాక కెరియర్ కూడా ముగింపుకు దగ్గర పడుతున్న భామలు నిన్న కాక మొన్నొచ్చిన అనుపమను చూసి కుళ్లుకుంటున్నారు. ఇక మలయాళ భామలకు తెలుగులో తిరుగులేదన్న సెంటిమెంట్ ఉండనే ఉంది.

ఆ క్రమంలోనే త్రివిక్రం, పవన్ సినిమాతో అనుపమ మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. తన చూపులతో యువత మనసు దోచేస్తున్న అనుపమ చూస్తుంటే స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి అమ్మడి లక్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.