మొదటి ఆట పవన్ కే అట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చి సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాడు. సప్తగిరి హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఆడియోని సక్సెస్ చేసిన కారణం చేత చిత్రయూనిట్ పవన్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారట. ఇక మాటలో మాటగా సినిమా ఎప్పుడు చూపిస్తున్నావ్ అని సప్తగిరిని అడిగాడట పవన్ కళ్యాణ్. ఏదో స్టేజ్ మీద మాటవరసకు అన్నాడులే అనుకుంటే పవన్ నిజంగానే సప్తగిరి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.

మరో రెండు మూడు రోజుల్లో సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంటుందని.. అది కాగానే మొదటి ఆట మీకే చూపిస్తాం సార్ అనేశారట చిత్ర దర్శక నిర్మాతలు. సప్తగిరి కమెడియన్ ఇలాంటి లెక్కలేమి చూసుకోకుండా సినిమాకు దాదాపు 6 కోట్ల బడ్జెట్ పెట్టేశారట. పవన్ ఆడియోకి వచ్చినప్పటి నుండి సినిమాకు క్రేజ్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు ఓ బడా డిస్ట్రిబ్యూటర్ సినిమాను అవుట్ రైట్ గా కొనాలాని చూస్తున్నాడట. మరి పవన్ ఆడియోకి వస్తే ఓ మీడియం బడ్జెట్ సినిమాకు ఇన్ని లాభాలున్నాయంటే కచ్చితంగా చిన్న సినిమా దర్శక నిర్మాతలు ఆలోచించాల్సిన విషయమే.