రిలీజ్ సినిమాలకు మోది షాక్..!

ఓ సినిమా రిలీజ్ అవుతుంటే రిలీజ్ కు ముందు రెండు మూడు రోజుల దాకా సినిమాకు సంబందించిన లావాదేవీలన్ని ఫైనల్ చేస్తారు. చివరి నిమిషంలో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగే సినిమాలు చాలా ఉంటాయి. ఇక ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ పెట్టుకునే దర్శక నిర్మాతలు మోది పేల్చిన 500, 1000 రూపాయల నోట్ల రద్దుకి షాక్ తగిలినట్టైంది. ఇప్పటికే ఈ వారం రిలీజ్ అవ్వాల్సిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా ఈ కారణంగానే పోస్ట్ పోన్ అయ్యిందని అంటున్నారు.

ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న చాలా సినిమాలకు రిలీజ్ కష్టాలేమో కాని సినిమా చూసేందుకు ఆడియెన్స్ మాత్రం కష్టాలు పడాల్సి ఉంది. 500, 1000 నోట్లు థియేటర్స్ లో కూడా తీసుకోవట్లేదు కాబట్టి ప్రేక్షకులు కూడా సినిమా చూసే ఇంట్రెస్ట్ లేదు. ముందు తమ దగ్గరున్న నోట్లను మార్చుకునే పనిలో బిజీగా ఉంటారు. సో మోది తీసుకున్న ఈ నిర్ణయం దేశానికి ఎంతో ఉపయోగపడేలా చేస్తున్నా సినిమా వాళ్లకు మాత్రం తీరని నష్టం కలిగిస్తుందని చెప్పొచ్చు. 

ఇక మోది ప్రకటించిన ఈ నిర్ణయాన్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నా సడెన్ గా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తిట్టుకుంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా నల్లధన నిర్మూళనకు మోది వేసిన మొదటి స్టెప్పులు నల్లధన రాజుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తున్నాయన్నది నిజం.