సుధీర్ బాబు ‘హరోంహర’ ట్రైలర్‌... అదిరిపోయిందిగా

సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా వస్తున్న ‘హరోంహర’ సినిమా ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ సినిమాని నిర్మింస్తున్నారు. 

తుపాకులు తయారుచేసి డబ్బు సంపాదించుకోవచ్చనే చిన్న ఆలోచనతో చిన్నగా పని మొదలుపెట్టి భారీ స్థాయిలో అన్ని రకాల తుపాకులు తయారుచేసే స్థాయికి హీరో ఎదుగుతాడు. ఆ క్రమంలో అతనికి ఓ గ్యాంగ్, వారికి శత్రువులు ఏర్పడటం, వారి పోరాటాలు, మద్యలో పోలీసులు... క్లుప్తంగా సినిమా కధ ఇదనుకోవచ్చు. ఈ సినిమాని 1980లలో రాయలసీమలో జరిగిన్నట్లు తీశారు. కనుక పుష్ప ట్రెండ్ అందరూ ఫాలో అయిపోతున్నట్లే అనిపిస్తోంది. 

ఈ సినిమాలో సునీల్, జయప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: జ్ఞానసాగర్ ద్వారకా, సంగీతం: చైతన్య భరద్వాజ్, కెమెరా: అర్వింద్ విశ్వనాధన్, ఎడిటింగ్: రవితేజ గిరిజాల, ఆర్ట్: ఏ రామాంజనేయులు, యాక్షన్: శక్తి శర్వణన్, నిఖిల్ రాజ్, స్టంట్ జాషువ. జూన్ 14వ తేదీన ‘హరోంహర’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.