
తెలుగులో ఉన్న విలక్షణ నటుళ్లో శర్వానంద్ ఒకరు. మెగా పవర్ స్టార్ తో చిన్న నాటి స్నేహితుడైన శర్వానంద్ పెళ్లికి చరణ్ సహాయం అందిస్తున్నాడట. అదెలాగా అంటే చెర్రి భాద్య ఉపాసన కజిన్ (సిస్టర్) తో శర్వానంద్ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఇరువురు నచ్చి పెళ్లికి సిద్ధమవడంతో రెండు ఫ్యామిలీలు ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
అయితే ఈ పెళ్లి పెద్ద రామ్ చరణ్ అనే తెలుస్తుంది. స్నేహితుడి పెళ్లికి లైన్ క్లియర్ చేసింది అతనే అట. శర్వానంద్ పెళ్లి న్యూస్ త్వరలో బయటకు రానున్నదట. ఉపాసన కజిన్ అంటే శర్వా కూడా ఓ మంచి బిజినెస్ మ్యాన్ కూతురినే పెళ్లాడుతున్నాడన్నమాట. హీరోగా తనకంటూ ఓ సెపరెట్ ఇమేజ్ ఏరపరచుకున్న శర్వానంద్ పెళ్లి తర్వాత కూడా అదే ఫాం కొనసాగిస్తాడని చెప్పొచ్చు. ఇంతకీ మనోడి మనసు దోచిన ఆ సుందరి ఎవరో త్వరలో వెళ్లడవుతుంది.