
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్న మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్, ఆ తర్వాత ‘సీతారామం’తో మరింత దగ్గరయ్యాడు. తాజాగా లక్కీ భాస్కర్ అనే మరో సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ సాధారణ మద్య తరగతికి చెందిన యువకుడుగా నటిస్తున్నాడు. అతను జీవితంలో ఏవిదంగా అంచలంచెలుగా పైకి ఎదిగాడనేది ఈ సినిమా కధ అని తెలుస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గానటిస్తోంది. ఈ సినిమాకు సంగీతం జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: నిమిష్ రవి, ఎడిటింగ్: నవీన్ నూలి, చేస్తున్నారు.
సూర్యదేవర నాగవంశీ, సౌజన్య కలిసి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై లక్కీ భాస్కర్ సినిమా నిర్మిస్తున్నారు.