
కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో భజే వాయువేగం సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నాలుగు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌లో కార్తికేయ యాక్షన్ సీన్లు, కెమెరా వర్క్ చాలా బాగున్నాయి. అలాగే భావోద్వేగ సన్నివేశాలలో కూడా కార్తికేయ నటన బాగుంది. సినిమాలో తనికెళ్ళ భరణి రవి శంకర్, శరత్ లోహితస్వ, రాహుల్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. వారితో ట్రైలర్‌కు నిండుతనం వచ్చింది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి, సంగీతం: కపిల్ కుమార్, డైలాగ్స్: మధు శ్రీనివాస్, కెమెరా: ఆర్‌డి రాజశేఖర్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటింగ్: సత్యా జి చేశారు. ఈ సినిమాని యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా నిర్మించారు.