‘పుష్ప-2 ది రూల్’ సినిమాలో రెండో పాట బుధవారం ఉదయం 11.07 గంటలకు విడుదల కాబోతోందని ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక మందన స్వయంగా ప్రకటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి డాన్స్ చేస్తున్న ఫోటోని కూడా ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా చేరారు.
పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.