కళ్యాణ్ రామ్ ది ఫిస్ట్ ఆఫ్ ఫేమ్... ఫస్ట్ గ్లిమ్స్‌

బింబిసారతో హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ తర్వాత డెవిల్ సినిమాతో మరో హిట్ కొట్టాడు కానీ దాని తర్వాత చేసిన అమిగోస్ సినిమాతో బోర్లా పడ్డాడు.

దాని తర్వాత ప్రదీప్ చిలుకూరితో తన 21వ సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమాలో కళ్యాణ్ రామ్‌ని పరిచయం చేస్తూ ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫేమ్’ పేరుతో ఫస్ట్ గ్లిమ్స్‌ ఈరోజు తాత ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా విడుదల చేశారు. 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విజయశాంతి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. శ్రీకాంత్, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే: విస్సా శ్రీకాంత్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియెషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్నారు.      ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.