
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేస్తున్న మహేష్ కొరటాల శివతో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈరోజు సినిమా ముహుర్త కార్యక్రమాలు రామానాయుడు స్టూడియో జరిగాయి. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత డివివి దానయ్య మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తన సినిమా ముహుర్తం అయినా మహేష్ మాత్రం అటెండ్ అవలేదు. ముందు ఈ కార్యక్రమానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నా చివరి నిమిషంలో రావడం కుదరలేదట. ఇక మహేష్ బదులు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఈ ముహుర్తపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమంతుడు తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మరో సామాజిక అంశంతో రాబోతుందట. 'భరత్ అను నేను' టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుందట.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడుతుందట.