కల్కి ఎడి2898 షూటింగ్‌ సమాప్తం... ఇదిగో ప్రూఫ్!

ప్రభాస్‌-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో కల్కి ఎడి2898 వచ్చే నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ‘బుజ్జి వెహికల్’తో ప్రభాస్, కల్కి టీమ్‌ చేసిన హడావుడితో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.  ఇప్పుడు అభిమానులకు మరో శుభవార్త. కల్కి ఎడి2898 సినిమాకి సంబందించి ప్యాచ్ వర్క్ తో సహా షూటింగ్‌ మొత్తం పూర్తయిపోయింది.

ఈ సినిమా కోసం పనిచేసిన యూనిట్ సభ్యులకు వైజయంతీ మూవీస్ కొన్ని కానుకలు ఇచ్చింది. వాటి ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది.

కనుక ఇక నుంచి కల్కి ఎడి2898 ప్రమోషన్స్ మొదలవబోతున్నాయి. అవి ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సిందే. 

ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర పేరు భైరవకాగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్ మహాభారతం కాలంలో శాపగ్రస్తుడైన అశ్వధామగా నటిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు కమల్ హాసన్, రానా దాగుబాటి, దుల్కర్ సల్మాన్, పశుపతి, శాశ్వత చటర్జీ, అన్నా బెన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.      

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి.అశ్వినీ దత్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.