పుష్ప-2 నుంచి రెండో పాట 27న

అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప-ది రైజ్ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట వైరల్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు రెండో పాట కూడా విడుదల చేయబోతున్నామని హీరోయిన్ రష్మిక చేత వెరైటీగా పుష్ప ప్రకటించాడు.

సూసేకా... అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్ వ్రాయగా దానిని దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచాడు. ఈ నెల 27 ఉదయం 11.07 గంటలకు ఈ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయబోతున్నట్లు పుష్ప టీమ్ ప్రకటించింది.

ఈ సినిమాలో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాపుష్ప-ది రైజ్ ఆగస్ట్ 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.