
మెగా హీరోలకు ఉక్రెయిన్ బాగా కలిసి వచ్చిందనుకుంటా అందుకే ప్రతి ఒక్క మెగా హీరో ఉక్రెయిన్ లో ఓ సాంగ్ షూట్ పెట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ సరైనోడుతో మొదలు పెట్టిన ఈ లొకేషన్ షూటింగ్ రీసెంట్ గా మెగాస్టార్ కూడా ఈ లొకేషన్స్ లో చేసేందుకు సై అన్నాడట. ప్రస్తుతం ఉక్రెయిన్ లో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ విన్నర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ షెడ్యూల్ లో అనసూయతో ఐటం సాంగ్ షూట్ చేస్తున్నారట. ఉక్రెయిన్ లో కొరికేసే చలిలో అనసూయతో ఐటం అదరగొడుతుందని అంటున్నారు.
పవర్ స్టార్ తో ఐటం సాంగ్ కు నో చెప్పి మెగా మేనళ్లుడి ఐటం కు ఎస్ చెప్పిన అనసూయ ఈ సాంగ్ లో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. అటు స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ అనే తేడా లేకుండా అనసూయ తన హవా కొనసాగిస్తుందని చెప్పొచ్చు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విన్నర్ అనే టైటిల్ పెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేసి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కేయాలని చూస్తున్నాడు మెగా హీరో సాయి ధరం తేజ్.