
హీరోయిన్ గా ఛాన్సెస్ రానప్పుడు ఓ హాట్ ఫోటో షూట్ చేయడమే లేక హాట్ కామెంట్స్ చేయడమో హీరోయిన్స్ కు అలవాటే. ప్రస్తుతం తెలుగులో వరుసెంట అవకాశాలు అందిపుచ్చుకుంటున్నా స్టార్స్ తో మాత్రం ఛాన్స్ రావట్లేదని దిగులు పడుతున్న రెజినా తనకు టాలీవుడ్లో వాళ్లిద్దరు సెక్సియెస్ట్ పర్సన్స్ అని అంటుంది. ఇంతకీ ఎవరి గురించి రెజినా అలా అన్నది అంటే మహేష్, రాం చరణ్ అని తెలుస్తుంది.
తనతో పాటుగా కెరియర్ ప్రారంభించిన రకుల్ ఇప్పటికే వారిద్దరితో నటిస్తుండగా రెజినా మాతం ఇంకా కుర్ర హీరోల దగ్గరే ఉండిపోయింది. అందుకే వారిని టార్గెట్ చేస్తూ సెక్సియెస్ట్ పర్సన్స్ అంటూ వారి దృష్టిలో పడాలని చూస్తుంది. అయితే రెజినా చేసిన ఈ కామెంట్స్ కు సాయి ధరం తేజ్, సందీప్ కిషన్ హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు అమ్మడితో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది కాబట్టి. మరి రెజినా కోరిక మహేష్, చరణ్ లలో ఎవరు తీరుస్తారో చూడాలి.