
కమెడియన్ ఆలి తన మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడటం చూస్తుంటే ఉంటాం.. ఆ మాటల వల్లే సరదాగా అన్న సరే కాస్త నెగటివ్ ప్రచారం జరిగి అతని మీద అపవాదాలు మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఈ ప్రయత్నంలో మిగతా కమెడియన్స్ మీద సెటైర్స్ వేయడంలో కూడా ఆలి ఏం ఆలోచించడు. రీసెంట్ గా సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోలో ఆలి చేసిన కామెంట్స్ అక్కడికి వచ్చిన మరో కమేడియన్ కం హీరో సునీల్ కు తగిలాయని అంటున్నారు.
ఇంతకీ ఆలి ఏమన్నాడు అంటే.. కమెడియన్ కు హీరో అవకాశం రావడం లాటరీ టికెట్ లాంటిది ఆ టికెట్ తగలడం లాంటిది అది తగిలితే ఆ డబ్బులు జేబులో వేసుకుని మళ్లీ రొటీన్ గా కమెడియన్ గా కంటిన్యూ చేయాలని సలహా ఇచ్చాడు. అయితే కమెడియన్ నుండి హీరో టర్న్ అయిన సునీల్ ఇప్పుడు ఏమంత ఫాంలో లేడు. అయితే సరిగ్గా ఆ ఆడియోకి సునీల్ రావడం ఆలి ఈ హాట్ కామెంట్స్ చేయడం చూస్తుంటే సునీల్ కు తగిలేట్టే ఆలి ఆ వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. మరి అసలు విషయం ఏంటో ఆలికే తెలియాలి.