మోది డెశిషన్ కు బన్ని రెస్పాన్స్..!

ప్రధాన మంత్రి నరేందర్ మోది ప్రకటించిన 500, 1000 నోట్ల రద్దు నిర్ణయానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ తనదైన రీతిలో స్పందించారు. నల్లధనం నిర్మూలించే క్రమంలో మోది తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తన స్పందన తెలియచేస్తూ అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ఇండియన్ ఫ్లాగ్ తో పాటుగా క్లాప్ సింబల్స్ చాలా ఉంచడం జరిగింది.

ఈరోజు అర్ధరాత్రి నుండి 500, 1000 రూపాయల నోట్లు రద్దు అవుతున్నాయి. కొత్త 500, 2000 నోట్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక అత్యవసర సేవలు.. హాస్పిటల్, రైల్వే స్టేషన్ లాంటి వాటిలో పాత నోట్లు తీసుకునే అవకాశం ఉంది. తమ వద్ద ఉన్న మొత్తాన్ని బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీస్ లలో డిపాజిట్ చేయాల్సిందిగా ప్రకటన ఇచ్చారు.