
కన్నడ పరిశ్రమలో విశాద ఛాయలు అలముకున్నాయి. మస్తిగుడి అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇద్దరు కన్నడ నటులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సినిమా క్లైమాక్స్ ను కోటికి పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. బెంగుళూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వాయర్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. ఫ్లైట్ట్ దిగి పారిపోతున్న ఉదయ్, అనీల్ లను హీరో పట్టుకోవాలి. అయితే రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడం వల్ల అనీల్, ఉదయ్ లు ఎంత ఈదినా ఒడ్డుకి చేరుకోలేకపోయారట.
ఇక హీరో విజయ్ మాత్రం తనకు ఇచ్చిన లైఫ్ జాకెట్ వల్ల ఈదుకుంటూ ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ సంఘటన కన్నడ పరిశ్రమనే కాదు అన్ని భాషల సిని కార్మికులను దిగ్బ్రాంతికి గురి చేసింది. అనీల్, ఉదయ్ లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి జిమ్ చేసి మరి బాడీ పెంచుకున్నారట. యూనిట్ సభ్యులు చూస్తుండగానే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే అక్కడ దగ్గరలో ఉన్న బోట్ కూడా ఆ సమయంలో పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.