రమా రాజమౌళి డ్యాన్స్ చూశారా?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి పెద్ద హీరోలతో భారీ బడ్జెట్‌ సినిమాలు తీస్తుంటారు. మద్యలో ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో బాగానే ఎంజాయ్ చేస్తారు కూడా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి దంపతులు ప్రభుదేవా ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్‌ ‘అందమైన ప్రేమరాణి’ పాటకు డ్యాన్స్ చేశారు.

ఏదో మొక్కుబడిగా కాకుండా చాలాసేపు రిహార్సల్స్ కూడా చేసి సరిగ్గా చేయగలమని నమ్మకం కుదిరాకే ఇద్దరూ పెళ్ళిలో డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. రాజమౌళి అంతటివాడు ఓ వివాహవేడుకలో డ్యాన్స్ చేశారంటే మామూలు విషయం కాదు కదా? అందుకే వారి డ్యాన్స్ రిహార్సల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రమారాజమౌళి డ్యాన్స్ ఎలా ఉందో ఓ సారి మీరు కూడా చూసి మార్కులు వేసేయండి. 

ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో దీనిని తీయబోతున్నట్లు రాజమౌళి ఇదివరకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెండు మూడు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.