1.jpeg)
గోపీచంద్ హీరోగా చేసిన ‘భీమా’ మార్చి 8న విడుదలై మిశ్రమ స్పందనతో ఓకే అనిపించుకొంది. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 25 నుంచి ప్రసారం కాబోతున్నట్లు డిస్నీ హాట్ స్టార్ తెలియజేసింది.
ఈ సినిమాలో ఎస్సై భీమాగా నటించిన గోపీచంద్‌కు హీరోయిన్లుగా మాళవిక శర్మ, భవానీ శంకర్ నటించారు. పరశురామ క్షేత్రంగా పేరొందిన మహేంద్రగిరి అనే ప్రాంతంలో విలన్ భవానీ (ముఖేష్ తివారీ) గ్యాంగ్ చేస్తున్న అరాచకాలను మన హీరో భీమా ఏవిదంగా అడ్డుకున్నాడనేది ఈ సినిమా కధ. కనుక గోపీచంద్ యాక్షన్, పంచ్ డైలాగులు, హీరోయిన్లతో రొమాన్స్‌తోనే ఈ కమర్షియల్ సినిమా నడుస్తుంది.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష, సంగీతం: రవి బస్రూర్, కొరియోగ్రఫీ: డాక్టర్ రవి వర్మ, కెమెరా: స్వామి జె గౌడ, స్టంట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. భీమా సినిమాని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.