ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చేయబోతున్న సంగతి తెలిసిందే. నిన్న ఉగాది రోజున ఆయన స్పిరిట్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ సినిమాని రూ.300 కోట్ల పెట్టుబడితో తీస్తున్నాము. ఆ పెట్టుబడి మొత్తం శాటిలైట్, డిజిటల్ రైట్స్ హక్కుల అమ్మకంతోనే ఎలాగూ తిరిగి వచ్చేస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్‌ని ఇంతవరకు ఎవరూ చూపని యాంగిల్స్‌లో, చాలా డిఫరెంట్ లుక్‌తో చూపించబోతున్నాను. అది ప్రభాస్ అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తోనే అది చూపించబోతున్నా.
స్పిరిట్ సినిమా రిలీజ్ అయిన తొలిరోజే రూ.150 కోట్లు కలక్షన్స్ సాధించడం ఖాయం. ఈ సినిమా గురించి నాకు అంత నమ్మకం ఉంది. వీలైతే భవిష్యత్ మైఖేల్ జాక్సన్ జీవిత కధ ఆధారంగా ఓ బయోపిక్ చేస్తాను,” అని చెప్పారు.
ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి ఎడి2898’, మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’, మంచు విష్ణు హీరోగా వస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో శివుడిగా నటిస్తున్నారు. ‘కల్కి ఎడి2898’ ఈ మే నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది. ‘ది రాజా సాబ్’ ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు కానీ దసరా దీపావళి పండుగ సీజనులో విడుదలయ్యే అవకాశం ఉంది.